వైరల్: నెటిజన్ కామెంట్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మిక..!

Published on Dec 16, 2021 1:00 am IST


టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 17న రిలీజ్ కాబోతున్న “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సామీ సామీ సాంగ్‌ కోసం ఎంతో కష్టపడ్డానని, అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలంటూ మాట్లాడిన ఓ వీడియోను ఆమె సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది.

ఆ వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘అసలు దీన్ని హీరోయిన్‌గా తీసుకోకుండా ఉండాల్సింది. ఇది.. దీని ఓవర్‌ యాక్టింగ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. అతడి కామెంట్‌కి స్పందించిన రష్మిక “యాక్టింగో, ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను. నువ్వు ఏం సాధించావు నాన్నా” అంటూ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత సమాచారం :