వైరల్ పిక్స్ : రష్యాలో పింక్ డ్రెస్ లో అదరగొట్టిన రష్మిక

Published on Dec 1, 2022 12:25 am IST

టాలీవుడ్ తో పాటు ప్రస్తుతం తమిళ్, హిందీ భాషల్లో కూడా స్టార్ నటిగా వరుసగా అవకాశాలతో దూసుకెళ్తున్నారు యువ భామ రష్మిక మందన్న. నాలుగేళ్ళ క్రితం నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల తీసిన ఛలో మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీ తోనే మంచి సక్సెస్ అందుకున్న రష్మిక, ఆ తరువాత వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు. ఇటీవల పాన్ ఇండియా మూవీ పుష్ప తో దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ మనసు దోచి నేషనల్ క్రష్ గా పేరు దక్కించుకున్న రష్మిక లేటెస్ట్ గా ఇలయతలపతి విజయ్ తో వరిసు మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే.

అయితే విషయం ఏమిటంటే, బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప మూవీ డిసెంబర్ 8 న రష్యాలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ కోసం నేడు రష్యా వెళ్లారు టీమ్ సభ్యులు. అలానే నేడు అక్కడి పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చిన పుష్ప టీమ్, తప్పకుండా రష్యన్ ఆడియన్స్ ని కూడా తమ మూవీ ఆకట్టుకుంటుందనే ఆశాభవం వ్యక్తం చేస్తోంది. కాగా అక్కడి అందాలను హాయిగా ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న, స్టైలిష్ ట్రెండీ పింక్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో దిగిన రెండు పిక్స్ ని కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. తాను రష్యా అందాలను ఎంజాయ్ చేస్తున్నానని, తప్పకుండా త్వరలో తెరకెక్కనున్న పుష్ప 2 మూవీ కూడా మీ అందరి అంచనాలు అందుకునేలా ఉంటుందని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :