రష్మీక మందన్న బాలీవుడ్ డెబ్యూ మూవీ కి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Mar 9, 2022 1:30 pm IST

రష్మిక మందన్న వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ మేరకు బాలీవుడ్ లోకి సైతం ఇటీవల అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సిద్ధార్ద్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇది ఆమెకు బాలీవుడ్ లో డెబ్యూ మూవీ. శంతను బగ్గీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ను జూన్ 10, 2022 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ కి సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

పుష్ప ది రైజ్ చిత్రం తో దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న రష్మీక పుష్ప ది రూల్ తో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. వరుస అవకాశాలతో రష్మీక మందన్న బిజిగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :