రష్మిక “మిషన్ మజ్ను” రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Nov 3, 2021 9:12 am IST

రష్మీక మందన్న టాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకు పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మిషన్ మజ్ను అనే చిత్రం తో రష్మీక బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది.

ఈ చిత్రం ను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది మే 23 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను త్వరలో చిత్ర యూనిట్ మొదలు పెట్టనుంది. భారత దేశ గూఢచార సంస్థ raw యొక్క కార్యకలపాలను పాకిస్తాన్ లో ఎలా జరుపుతుంది అనేది చిత్రం లో చూపించనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అనే పాన్ ఇండియా మూవీ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More