లేటెస్ట్ : విజయ్ దేవరకొండ తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన రష్మిక

Published on Jan 27, 2023 1:23 am IST


టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన రష్మిక మందన్న ప్రస్తుతం ఇటు తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా మంచి అవకాశాలతో కొనసాగుతున్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ఆమె హీరోయిన్ గా తెరకెక్కిన గుడ్ బై, అలానే లేటెస్ట్ గా ఆమె హీరోయిన్ గా సిద్దార్ధ మల్హోత్రా హీరోగా రూపొందిన మిషన్ మజ్ను వంటి బాలీవుడ్ సినిమాలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని అక్కడ కూడా ఆమెకు మరింత పేరు తీసుకువచ్చాయి. ఇక ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 మూవీ చేస్తున్నారు రష్మిక మందన్న.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల కొన్నాళ్లుగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ల మధ్య రిలేషన్ పై పలు మీడియా మాధ్యమాల్లో రకరకాల కథనాలు ప్రచారం అవడంతో పాటు పలు ట్రోల్స్ కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా వాటిపై క్లారిటీ ఇచ్చారు రష్మిక. నిజానికి తనకు ఉన్న మంచి మిత్రుల్లో విజయ్ కూడా ఒకరని, ఇటీవల మేమిద్దరం ఫ్రెండ్లీ గా వెకేషన్ కి వెళ్ళాము, అంతే తప్ప అందులో తప్పుగా అర్ధం చేసుకోవలసింది ఏమి లేదని అన్నారు.

ఆ తరువాత పలువురు మీడియా వారు ఏదిపడితే అది రాయడం మరికొందరు ట్రోల్స్ చేయడం తనను ఒకింత బాధించిందన్నారు. విజయ్ తో తనకు ఎప్పటికీ మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుందని, ఎవరైనా ఒకరిని విమర్శించేటపుడు అందులో వాస్తవాలు తెలుసుకుని చేయాలని, అటువంటి వాటి వలన వారి జీవితానికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అన్నారు. అందువలన ఇకపై ఇటువంటివి జరుగకూడదనే తాను దీనిపై క్లారిటీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత సమాచారం :