‘కుబేర’ నుండి ర‌ష్మిక రాక‌కు టైమ్ ఫిక్స్!

‘కుబేర’ నుండి ర‌ష్మిక రాక‌కు టైమ్ ఫిక్స్!

Published on Jul 4, 2024 3:25 PM IST

టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో ‘కుబేర’ మూవీ కూడా ఒక‌టి. ద‌ర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున‌, త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ క‌లిసి న‌టిస్తుండటంతో ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలోని హీరోల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు ఇప్ప‌టికే రిలీజ్ చేశారు మేక‌ర్స్.

కాగా, ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇక ఈ బ్యూటీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను జూలై 5న రిలీజ్ చేస్తున్నట్లు మేక‌ర్స్ ఇప్పటికే వెల్ల‌డించారు. తాజాగా ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ టైమ్ ను కూడా వారు రివీల్ చేశారు. జూలై 5న ఉద‌యం 11.34 గంట‌లకు ర‌ష్మిక రాక ఉంటుంద‌ని ‘కుబేర’ మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాతో శేఖ‌ర్ క‌మ్ముల మరోసారి బాక్సాఫీస్ వ‌ద్ద త‌న సత్తా చూపాల‌ని చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ్, ధ‌నుష్ ల ప‌ర్ఫార్మెన్స్ లు నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండ‌గా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహ‌న్ రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు