‘కుబేర’లో ర‌ష్మిక లుక్.. రివీల్ అయ్యేది ఆ రోజే!

‘కుబేర’లో ర‌ష్మిక లుక్.. రివీల్ అయ్యేది ఆ రోజే!

Published on Jul 2, 2024 6:00 PM IST

కింగ్ నాగార్జున‌, త‌మిళ హీరో ధ‌నుష్ క‌లిసి న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్.

ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ప్రీలుక్ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ర‌ష్మిక ల‌గేజ్ ప‌ట్టుకుని అడ‌వి బాట‌లో ప‌య‌నిస్తున్న‌ట్లుగా మ‌న‌కు ఈ పోస్ట‌ర్ లో చూపెట్టారు. అయితే ఆమె ముఖం చూపెట్ట‌కుండా, వెన‌కాల నుండి ఈ పోస్ట‌ర్ ను డిజైన్ చేశారు. కాగా, ఈ మూవీలో ఆమె పాత్ర‌ను జూలై 5న ఇంట్రొడ్యూస్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అనే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో నెల‌కొంది. ఇక ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూరి రామ్ మోహ‌న్ రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు