“పుష్ప” చిత్రం నుండి రష్మిక లుక్ రేపే విడుదల!

Published on Sep 28, 2021 7:12 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైస్. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యి సినిమా పై అంచనాలను పెంచేసింది. అయితే ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు కూడా హీరోయిన్ రష్మీక లుక్ విడుదల కాలేదు. అయితే రష్మీక ఫస్ట్ లుక్ విడుదల కోసం చిత్త unit సన్నాహాలు చేస్తుంది.

పుష్ప చిత్రం నుండి రష్మీక మండన్న లుక్ ను రేపు ఉదయం 9:45 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. పుష్ప లవ్ ను రేపు ఉదయం కలవండి అంటూ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ ముత్తమ్ శెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :