వైరల్ వీడియో : ట్రెండీ లుక్ లో హీట్ రెయిజ్ చేస్తున్న రష్మిక

Published on Aug 1, 2022 11:02 pm IST

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఒక్కో సినిమాతో హీరోయిన్ గా మంచి క్రేజ్ ని ఫాలోయింగ్ ని సంపాదించుకుని స్టార్ హీరయిన్ గా దూసుకెళ్తున్నారు యువ నటి రష్మిక మందన్న. అతి త్వరలో అల్లుఅర్జున్ తో ఆమె పుష్ప ది రూల్ మూవీ లో నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సీతారామం మూవీ లో కీలక రోల్ చేశారు రష్మిక మందన్న. ఆ మూవీ ఆగష్టు 5 న రిలీజ్ కానుంది.

ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో అలానే ఆడియన్స్ తో తన సినిమాలు, ఫ్యామిలీ, పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే అలవాటు గల రష్మిక మందన్న నేడు ట్రెండీ స్టైల్ దుస్తులు ధరించి అదిరిపోయే లుక్ లో నిర్వహించిన ఒక ఫోటో షూట్ తాలూకూ వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అదిరిపోయే లుక్ లో హీట్ రేయిజ్ చేస్తున్న రష్మిక నటించిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా పలువురు రష్మిక ఫాన్స్ దాన్ని మరింతగా షేర్స్, లైక్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :