ఇది సరైన పద్దతి కాదు…పుష్ప ఫస్ట్ సింగిల్ పై రష్మిక రెస్పాన్స్!

Published on Aug 13, 2021 3:43 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుటండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం కావడం, సుకుమార్ తో హ్యాట్రిక్ చిత్రం కావడం తో పుష్ప టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేయడం జరిగింది. దాక్కొ దాక్కొ మేక అంటూ విడుదల అయి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట పై రష్మిక మందన్న స్పందించడం జరిగింది.

ఈ పాట అత్యద్భుతంగా ఉంది అని అన్నారు. అమెజింగ్ క్రేజీ స్టఫ్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఇది సరైన పద్దతి కాదు అంటూ చెప్పుకొచ్చారు. పెద్ద ఐస్ బర్గ్ లోని చిన్న ముక్కను చూపించడం సరైన పద్దతి కాదు అంటూ చెప్పుకొచ్చారు. రష్మిక మందన్నా ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :