సంచలనంగా మారిన రష్మికా లేటెస్ట్ కామెంట్స్.!

సంచలనంగా మారిన రష్మికా లేటెస్ట్ కామెంట్స్.!

Published on Dec 29, 2022 7:01 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనతి కాలం లోనే భారీ స్టార్డం తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో రష్మికా మందన్నా కూడా ఒకామె కాగా ఇప్పుడు సౌత్ లో పలు భారీ చిత్రలు ఈమె హీరోయిన్ గా చేస్తుంది. అయితే తెలుగు తమిళ్ తో పాటుగా హిందీలో రష్మికా సినిమాలు దక్కించుకోగా లేటెస్ట్ గా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సంచలనంగా మారాయి.

తాను మొదటిసారి చేసిన రొమాంటిక్ సాంగ్ బాలీవుడ్ నుంచే అని సౌత్ లో అయితే ఇలాంటి సాంగ్ ఉండవు అని మా దగ్గర ఎప్పుడూ ఎక్కివగా మాస్ మసాలా సాంగ్స్ లేదా ఐటమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అని అందుకే తన మొదటి రొమాంటిక్ సాంగ్ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని ఆమె తెలిపింది. దీనితో ఇప్పుడు ఈ షాకింగ్ కామెంట్స్ సినీ వర్గాలు సహా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక్కడ నుంచి స్టార్డం తెచ్చుకొని రష్మికా సౌత్ సినిమాలు తక్కువ చేయడం బాగోలేదని కొందరు నెటీజన్స్ అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు