సాలిడ్ కిక్స్ తో గట్టిగా కష్టపడుతున్న రష్మికా.!

Published on Oct 23, 2021 12:31 pm IST

ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ లక్కీ అండ్ హిట్స్ ఉన్న హీరోయిన్స్ లో రష్మికా మందన్నా కూడా ఒకరు. యంగ్ ఏజ్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుని పాన్ ఇండియన్ సినిమాలు చేసే లెవెల్ కి కూడా వచ్చేసింది. అయితే రష్మికా మందన్నా ఓ పక్క గ్లామర్ తో పాటు అదిరే డాన్స్ లు ఫిట్నెస్ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందని తెలుసు.

కానీ లేటెస్ట్ గా తన ఇన్స్టా లో పెట్టినటువంటి రీల్ తో ఏదో యాక్షన్ సీక్వెన్స్ కోసం కూడా రెడీ అవుతుందా అనిపిస్తుంది. ఇందులో తన ట్రైనీ తో కిక్ బ్యాగ్ పై సాలిడ్ పంచ్ లు ఇస్తూ గట్టిగా కష్టపడుతుంది. దీనితో ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. మరి ఈ ట్రైనింగ్ అంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్న “పుష్ప” కోసమా లేక వేరే సినిమాలో ఏమన్నా రష్మికా నుంచి కొత్త షేడ్ చూస్తామా అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More