పుష్పకు నేషనల్ అవార్డ్ సహా అన్ని అవార్డులు పక్కా – రష్మిక మందన

Published on Dec 22, 2021 1:30 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలో పుష్ప చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది.

ఈ సక్సెస్ మీట్‌లో హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ అల్లు అర్జున్ గారు మీకు నేను ఫ్యాన్ కాదు అంతకు మించి అని, సినిమాలో ఎంత అద్భుతంగా నటించారు? ఖచ్చితంగా ఈ ఏడాది నేషనల్ అవార్డులతో పాటు అన్ని అవార్డులు మీకు రాకపోతే నేను హర్ట్ అవుతాను. సుకుమార్ గారు మీ డైరెక్షన్ సూపర్.. మీ ఇద్దరు కలిసి చించేశారు. స్క్రీన్ మీద ఎనర్జీ చూస్తుంటే మాట్లాడటానికి మాటలు సరిపోవడం లేదు. డీఎస్పీ గారు మీ పాటలు అద్భుతం. ప్రతి ఒక్క పాట అదిరిపోయింది.

మా టీంకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. అందుకే ఆ దిష్టి నేను తీసుకుంటున్నాను. పుష్ప సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ ఎంతో కష్టపడ్డారు. కావాల్సిన ప్రతి ఒక్కటి కాదనకుండా ఇచ్చారు. ఈ రోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది అంటే దానికి కారణం మైత్రి మూవీ మేకర్స్. సునీల్ గారు మీరు అద్భుతంగా నటించారు. మొదటి సారి మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేకపోయాను. కుబా సర్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ సార్ మీది. సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటే దానికి మీరు కూడా ఒక ప్రధానమైన కారణం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు.

సంబంధిత సమాచారం :