‘బేబీ’ నుండి మూడవ సాంగ్ లాంచ్ చేయనున్న రష్మిక మందన్న

Published on May 15, 2023 6:49 pm IST

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా యువ దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ బేబీ. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ లవ్ స్టోరీ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పైమంచి హైప్ ఏర్పరిచాయి. ఇక విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి ప్రేమిస్తున్నా అనే పల్లవితో సాగె మూడవ సాంగ్ ని నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆవిష్కరించనున్నారు.

మే 16న హైదరాబాద్ లోని ఆర్ కె సినీ కాంప్లెక్స్ లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈవెంట్ లో భాగముగా రష్మిక ఈ సాంగ్ ని తన చేతుల మీదుగా లాంచ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ సినిమాని నిర్మించారు. కాగా అతి త్వరలో థియేటర్‌లో బేబీ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :