“కుబేర” నుంచి ఇంట్రెస్టింగ్ గా రష్మిక మందన్న ట్రీట్

“కుబేర” నుంచి ఇంట్రెస్టింగ్ గా రష్మిక మందన్న ట్రీట్

Published on Jul 5, 2024 12:22 PM IST


కోలీవుడ్ వెర్సటైల్ హీరో ధనుష్ హీరోగా మన టాలీవుడ్ లో కూడా పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన “సార్” చిత్రం మంచి హిట్ కాగా ఈ సినిమా తర్వాత మరో టాలీవుడ్ దర్శకుడు మ్యాజికల్ శేఖర్ కమ్ములతో చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చిత్రమే “కుబేర”. మరి అక్కినేని నాగార్జున కూడా ఈ చిత్రంలో ముఖ్య చేస్తుండగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.

అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ రష్మికా మందన్న ఫస్ట్ లుక్ మరియు ఆమెపై ఇంట్రెస్టింగ్ ఇంట్రో వీడియోని అయితే రిలీజ్ చేశారు. మరి ఇందులో రష్మిక ఒక గొయ్యి తవ్వి సూట్ కేస్ లో భారీ మొత్తంలో దాచి ఉంచిన డబ్బులు తీసి దాన్ని మరో చోటకి మారుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇందులో రష్మిక చాలా సింపుల్ లుక్స్ లో కనిపిస్తుండగా ఆమె పెర్ఫామెన్స్ మాత్రం సాలిడ్ గా ఉందని చెప్పాలి.

డబ్బు విషయంలో ఒక ఎగ్జైట్మెంట్, కంగారు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. మొత్తానికి అయితే శేఖర్ కమ్ముల అండ్ కో ఓ ఇంట్రెస్టింగ్ ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఆసియన్ సినిమాస్ వారు అమిగో క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు