పెళ్లి ఫోటోలు షేర్ చేసిన ‘రష్మిక మందన్నా’ !

Published on May 16, 2022 8:15 pm IST

క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా రేంజ్ ఇప్పుడు నేషనల్‌ రేంజ్. కిరాక్‌ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో నటిగా మారింది ఈ యంగ్ హీరోయిన్, అతి తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంటున్న రష్మిక తాజాగా ఓ పెళ్లి గురించి చేసిన మెసేజ్ అండ్ షేర్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇంతకీ పెళ్లి ఎవరిది ? రష్మిక ఏ మెసేజ్ చేసింది ? చూద్దాం రండి. రష్మిక చిన్ననాటి స్నేహితురాలి పెళ్లి. ఈ పెళ్లి గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ పెట్టింది. ‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌ రాగిని పెళ్లి. నా ఫ్లైట్‌ క్యాన్సిల్‌ కావడం వల్ల నేను ఈ పెళ్లికి హాజరు కాలేనేమో అని భయపడ్డాను. కానీ దేవుని దయ వల్ల నా ఫ్రెండ్ పెళ్లికి రాగలిగాను.

ఇక తను పోస్ట్ చేసిన ఫోటోలు గురించి ప్రస్తావిస్తూ.. ‘ఈ ఫోటోలో కనిపిస్తున్న గ్యాంగ్ లోనే నేను పెరిగాను. ఇప్పటికీ వీళ్లలో ఏ మార్పు లేదు. వీళ్లంతా నా వాళ్లు. నటిగా ఈ ప్రపంచానికి పరిచయం కాకముందు నేను ఇలాగే ఉండేదాన్ని. ఇప్పటికీ నాలో కూడా ఎలాంటి మార్పు రాలేదు’ అంటూ రష్మిక మెసేజ్ పోస్ట్ చేసింది. అలాగే తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు కూడా పోస్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :