రష్మిక ఎమోషనల్‌ పోస్ట్.. అమితాబ్ పై షాకింగ్ కామెంట్స్!

Published on Jun 27, 2022 2:45 pm IST

క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్‌ ‘గుడ్ బై’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా రష్మిక ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ మూవీకి సంబంధించి ఎంతో ఎమోషనల్‌ అవుతూ రష్మిక ఒక పోస్ట్‌ కూడా పెట్టింది. ‘గుడ్ బై. నా బిడ్డ ‘గుడ్ బై’కు ఇది చెప్పాలని లేదు. కానీ.. చెప్పాల్సిన టైం వచ్చింది. ఈ సినిమా జర్నీ ప్రారంభమై రెండేళ్లు గడిచాయి. ఎన్ని సమస్యలు ఉన్నా పార్టీ చేసుకోకుండా ఏదీ ఆపలేదు.

గుడ్ ‌బై ఎలాంటి మ్యాజిక్స్ చేస్తుందో చూడాలని ఆతృతగా ఉన్నాను. అమితాబ్ బచ్చన్ సార్.. మీరంటే నాకు చాలా అభిమానం. మీతో ఈ సినిమా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అత్యుత్తమ వ్యక్తి!. అంటూ రష్మిక ఎంతో ఎమోషనల్‌ గా రాసుకొచ్చింది. అన్నట్లు రష్మిక .. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమాలో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :