‘విజయ్ దేవరకొండ’తో రష్మిక స్పెషల్ సాంగ్ ?

‘విజయ్ దేవరకొండ’తో రష్మిక స్పెషల్ సాంగ్ ?

Published on Apr 24, 2022 7:38 PM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లైగర్’. ఐతే, ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీనిధి శెట్టిని సంప్రదించారని.. శ్రీనిధి శెట్టి లైగర్‌ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, మళ్లీ ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ ను రష్మిక మందన్నా చేయబోతుందని కొత్తగా పుకార్లు వినిపిస్తున్నాయి.

కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు