తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నమరో కొత్త హీరోయిన్ !


ఈ మధ్య తెలుగు పరిశ్రమలో ఇతర పరిశ్రమల నుండి కొత్త హీరోయిన్లు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే మలయాళం నుండి బోలెడంత మంది హీరోయిన్లు ఇక్కడికి దిగుమతి కాగా కన్నడ హీరోయిన్ల చూపు కూడా మెల్లగా టాలీవుడ్ పై పడుతోంది. ఇక్కడి యంగ్ హీరోలు, దర్శకులు కొత్త కథానాయికలు కోసం చూస్తుండటంతో వారికి ఆఫర్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కన్నడ అమ్మాయి, రీసెంట్ గా ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న తెలుగులో తన మొదటి చిత్రాన్ని మొదలుపెట్టనుంది.

గతేడాది ‘జ్యోఅచ్యుతానంద’ తో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా ఈరోజే తన కొత్త చిత్రాన్ని ప్రారంబించాడు. ఈ సినిమాతోనే రష్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. నాగ్ శౌర్య సొంత బ్యానర్ ‘ఐరా క్రియేషన్స్’ పై ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈ నెలాఖరు నుండి మొదలుకానుంది. ఇకపోతే కొద్దిరోజుల క్రితం రష్మిక అల్లు అర్జున్ రాబోయే చిత్రంలో కూడా హీరోయిన్ గా చేయనుందనే వార్తలొచ్చాయి.