‘చిత్తం మహారాణి’ నుంచి రష్మిక లాంచ్ చేసిన సాంగ్ కి మంచి రెస్పాన్స్.!

Published on Jan 6, 2022 10:40 am IST

టాలీవుడ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా “చిత్తం మహారాణి” కూడా ఒకటి. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కోలకళ్ళ చిన్నది లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఆలపించారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలోనే తెలియజేయనున్నారు.

ఇక ఈ సినిమాలో యజుర్వేద్, రచన సహా సునీల్, తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, వైవా హర్ష, జబర్దస్త్ అశోక్, నాయని పావని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి దర్శకుడు:- ఏ కాశీ, నిర్మాతలు:- జె ఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టి ఆర్, మాటలు :- సురేష్ సిద్హాని, ఎడిటర్:- కార్తీక శ్రీనివాస్, సంగీతం:- గౌర హరి, సినిమాటోగ్రఫీ:- విశ్వనాథ్ రెడ్డి, యాక్షన్ కొరియోగ్రాఫర్:- డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్ :- విజయ్ బిన్నీ, కలరిస్టు:- విష్ణు వర్ధన్ కె, పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్ కు అందిస్తున్నారు.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :