“మహా సముద్రం” చిత్రం నుండి చెప్పకే చెప్పకే పాటను విడుదల చేసిన రష్మీక!

Published on Sep 6, 2021 4:00 pm IST


శర్వానంద్, అదితి రావు హైదరి, అను ఇమాన్యూల్, జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. RX 100 లాంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు సైతం సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి చెప్పకే చెప్పకే అనే పాట ను విడుదల చేయడం జరిగింది. ప్రముఖ నటి రష్మీక మందన్న ఈ పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది అని, టీమ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. పాటను విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక ట్రైలర్ ను శర్వానంద్ చూపించారు అని, అందులో సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను చాలా అమేజింగ్ గా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.

పాట వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :