అందుకే ‘జెర్సీ’ రీమేక్ ఒప్పుకోలేదు – రష్మికా మండన్న

Published on Mar 27, 2020 2:00 am IST

నాని మూవీ ‘జెర్సీ’ హిందీలో కూడా భారీ స్థాయిలోనే రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మండన్నాను అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా అంగీకరించలేదు. కాగా రష్మిక దీని పై స్పందిస్తూ.. ‘నేను ఇప్పటీ వరకూ చేసిన సినిమాలే.. నాకు అవకాశాలు తెచ్చాయి. అందుకే నేను జెర్సీలో నటించాడానికి ఒప్పుకోలేదు. అలా అని ‘జెర్సీ’ మంచి సినిమా కాదని నేను చెప్పట్లేదు. కానీ నేను కమర్షియల్‌ సినిమాలే చేయాలనుకుంటున్నాను. కానీ ‘జెర్సీ’ రియలిస్టిక్ చిత్రం. అందుకే ఆ సినిమా ఒప్పుకోలేదు. అని చెప్పుకొచ్చారు.

ఇక షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే రీమేక్ ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో కూడా అమితాశక్తి నెలకొని ఉంది. మరి ఈ సారి షాహిద్ కి ఈ రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో చూడాలి. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More