“పుష్ప” నుంచి రష్మికా ఇంటెన్స్ లుక్..ఇంట్రెస్టింగ్ డీటైల్స్

Published on Sep 29, 2021 9:50 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంతే స్థాయి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఎప్పుడికప్పుడు సరైన అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్న మేకర్స్ నిన్న ఈ సినిమా నుంచి రష్మికా పోషిస్తున్న రోల్ పై ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ముందే మంచి ఇంటెన్స్ గా ఈ లుక్ ఉంటుంది అని మెన్షన్ చేసిన మేకర్స్ అందుకు తగ్గట్టుగానే రష్మికా ఇందులో చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. శ్రీవల్లిగా ఒక చీరకట్టులో ఎక్కడికో రెడీ అవుతున్నట్టుగా అలంకారం చేసుకుంటుంది. అద్దం, పూవులు ఈ సెటప్ అంతా కూడా చూస్తుంటే వింటేజ్ షేడ్స్ కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం సుకుమార్ అంతా కొత్తగానే ప్రెజెంట్ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :