మీకోసం నేర్చుకుని మరీ చెప్పాను – రష్మిక

Published on Dec 13, 2021 8:02 am IST

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. ‘’నేను ఇలా ఈ స్థాయిలో ప్రేక్షకులను ఒకేచోట చూసి చాలా రోజులు అయిపోయింది. ‘పుష్ప’కు సపోర్ట్ గా నిలిచిన మీరందరికీ థాంక్స్. నాకు బాగా గుర్తు ఉంది. ‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్‌ కు వచ్చినప్పుడు అల్లు అర్జున్‌ తో చేయాలని కోరుకున్నాను.

ఇప్పుడు ‘పుష్పరాజ్‌’కు శ్రీవల్లిగా నటించాను. నేను నా పేరెంట్స్ ను చూసి ఏడాదిన్నర అయింది. వాళ్లను మిస్సవుతున్నానన్న బాధ లేకుండా, ఏ కష్టం రాకుండా సుకుమార్‌ చూసుకున్నారు. ఒకవేళ నన్ను దత్తత తీసుకోవాలనుకుంటే పేపర్లు పంపండి. ‘పుష్ప’ మిమ్మల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. చిత్తూరు యాస నేర్చుకుని డబ్బింగ్‌ చెప్పటం చాలా కష్టం. మీకోసం నేర్చుకుని మరీ ఈ సినిమాకు చెప్పాను’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :