ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న విజయ్ – రష్మిక !

Published on Dec 20, 2021 5:00 pm IST


విజయ్ దేవరకొండకి రష్మిక మండన్నాకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ ఒకేసారి గీత గోవిందం సినిమాతో భారీ హిట్ పొందటంతో మొత్తానికి ఇద్దరికీ ఒకేసారి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ రకంగా రష్మిక విజయ్ దేవరకొండతో పాటు అతని ‘ఫ్యామిలీ’కి కూడా మంచి ఫ్రెండ్ అయింది. హైదరాబాద్ వచ్చినప్పుడు కచ్చితంగా విజయ్ ఇంటికి రష్మిక వెళ్తుందట. వారి మధ్య అంత స్నేహం ఉంది.

కాగా ప్రస్తుతం ఈ జంట తాజాగా ముంబై వీధుల్లో కనిపించారు. ఇద్దరికీ షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరికింది. దాంతో ఇద్దరూ ఆదివారం సాయంత్రం బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌ కి డిన్నర్‌ కోసం వెళ్లారు. ఆ సమయంలో మీడియా కంట పడింది ఈ జంట. ప్రస్తుతం కలిసి ఉన్న వీరి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పైగా చాలారోజుల తర్వాత విజయ్‌-రష్మిక కలిసి కనిపించారు.

సంబంధిత సమాచారం :