‘పెద్ది’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుండగా మేకర్స్ రీసెంట్ గానే ఢిల్లీ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీని నుంచి చరణ్ పిక్స్ కూడా లీకయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరి ఈ షెడ్యూల్ పైనే టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు. ఢిల్లీ షెడ్యూల్ ని మేకర్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టు తాను తెలిపారు. పోయెటిక్ గా లీనమయ్యిపోయే సీన్స్ ని తాము తీసినట్టుగా తెలిపారు. అలాగే రామ్ చరణ్ ఎప్పటిలానే తన బెస్ట్ ఇచ్చారు అంటూ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పిక్స్ ని తాను షేర్ చేసుకున్నారు. దీనితో రామ్ చరణ్ ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version