‘దేవ‌ర’ గోవా షూట్ పై ర‌త్న‌వేలు ఇంట్రెస్టింగ్ పోస్ట్

‘దేవ‌ర’ గోవా షూట్ పై ర‌త్న‌వేలు ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published on Jun 15, 2024 10:01 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవ‌ర’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ కొరటాల శివ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందా అని అంద‌రూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్ట‌ర్స్, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి.

కాగా, ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల గోవాలో జ‌రిగింది. గోవా షెడ్యూల్ లో ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్ర యూనిట్ చిత్రీక‌రించారు. గోవాలోని అట‌వీ ప్రాంతంలో ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ను చిత్రీక‌రించిన‌ట్లుగా చిత్ర డిఒపి ర‌త్న‌వేలు తెలిపారు. ఎన్టీర్, సైఫ్ అలీ ఖాన్ ల పై ఈ షూటింగ్ చేసిన‌ట్లుగా తెలిపారు. గోవాలో బ్యాడ్ వెద‌ర్, భారీ వ‌ర్షాలు ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమా షూటింగ్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

ఈ షూటింగ్ స‌క్సెస్ఫుల్ గా పూర్తి చేయ‌డంతో కెమెరా టీమ్, లైట్ టీమ్, స్టంట్ టీమ్ కు ఆయ‌న ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. ఇక ‘దేవ‌ర’ మూవీలో అందాల భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు