సాలిడ్ రెస్పాన్స్ తో అదరగొడుతున్న “రావణాసుర”.!

Published on Mar 11, 2023 3:11 pm IST

మాస్ మహారాజ రవితేజ నటించిన లాస్ట్ రెండు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్స్ కావడంతో నెక్స్ట్ తన నుంచి రానున్న సినిమాలపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. మరి ఈ లిస్ట్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర” కూడా ఒకటి. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేయగా దీనికి క్రేజీ రెస్పాన్స్ కొనసాగుతూ ఉండడం విశేషం.

లేటెస్ట్ గా ఈ టీజర్ మరో మాసివ్ మార్క్ 13 మిలియన్ ప్లస్ వ్యూస్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. దీనితో ఈ టీజర్ మాస్ మహారాజ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్న టీజర్ గా నిలిచి సినిమా పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో చూపిస్తుంది. ఇక ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్స్ కనిపించనుండగా యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. అలాగే అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :