స్ట్రైకింగ్ పోస్టర్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేసిన రవిబాబు

Ravi bbau

విలక్షణమైన సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు రవిబాబు. ఆయన ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తూ ఆయన వదిలిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఓ గ్లాస్‌లో చెవిని కోసి అందులో వేసిన ఈ పోస్టర్‌తో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అని అర్థమవుతుంది. ఇక ఇలాంటి జోనర్‌లో సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు రవిబాబు. దీంతో ఇప్పుడు కేవలం అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను డిసెంబర్ 24న ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version