విడుదల తేదీ : మే 8, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : రవిబాబు, తనీష్, ఇనయా సుల్తానా, బేబీ తేజల్ విఖ్యాతి, బెనర్జీ, వీరన్న చౌదరి, రామరాజు తదితరులు
దర్శకుడు : రవిబాబు
నిర్మాతలు : రవిబాబు, దగ్గుబాటి సురేష్ బాబు
సంగీతం : రాజేష్ ఎస్ ఎస్
ఛాయాగ్రహణం : భల్ల సత్యనారాయణ
కూర్పు : రిత్విక్ తమ్మారెడ్డి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన టాలీవుడ్ అండర్ రేటెడ్ క్రియేటివ్ దర్శకుల్లో ఒకరైన రవిబాబు నుంచి థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ యాక్షన్ చిత్రమే ‘రేజర్’. మరి ఈ సినిమాతో తను బౌన్స్ బ్యాక్ అయ్యారా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.
కథ:
హోమ్ మినిస్టర్ కనకరాజు (వీరన్న చౌదరి) అలాగే అప్పటికే రెండున్నరేళ్లు సీఎం గా ఉన్న సీతారామయ్య (రామరాజు) లకి తమ మధ్య ఉన్న ఒప్పందంతో కనకరాజు తనని సీఎం చెయ్యమని కోరతాడు. కానీ సీఎం పదవి నుంచి దిగనని చెప్పిన సీతారమయ్యాని కనకరాజు తన కొడుకులతో కలిసి హత్య చేస్తారు. అయితే ఈ వీడియో ఫుటేజ్ సీసీ కెమెరా బిజినెస్ చేసే విష్ణుధర్ (తనీష్) కి దొరుకుతుంది. దీనితో ఈ ట్రాప్ లో పడ్డ విష్ణు కూతురు తేజు(బేబీ తేజల్ విఖ్యాతి) ఎలా ఇరుక్కుంది? ఈ క్రమంలో ఆ పాపకి సేవియర్ గా మొబైల్ పెట్ గ్రూమర్ గా పని చేసుకునే రుద్ర ప్రతాప్ (రవిబాబు) ఎలా మారాడు? హోమ్ మినిస్టర్ ఎందుకు పాపని చంపాలని చూస్తాడు? అసలు ఈ రుద్ర ప్రతాప్ ఎవరు? తన గతం ఏంటి? పాపకి తనకి ఏమన్నా సంబంధం ఉందా? చివరికి ఆ పాపని పాప దగ్గర ఉన్న కీలక సమాచారాన్ని తను ఎలా సేకరించి కనకరాజుని సీఎం కాకుండా ఆపాడు అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
రవిబాబు ఫిల్మోగ్రఫీ కోసం మినిమం ఐడియా ఉన్న వారికి ఈ చిత్రం ఓ మోస్తరుగా ఓకే అనిపించవచ్చు. మెయిన్ గా రవిబాబు మార్క్ టేకింగ్ తన మార్క్ టైటిల్ కార్డ్స్ నుంచే స్టార్ట్ మొదలవుతుంది. ఇలా ఫస్టాఫ్ వరకు కథనం సాలిడ్ యాక్షన్ ఇంకోపక్క ఇంట్రెస్టింగ్ మైండ్ గేమ్ తో వెళుతుంది.
ఇక ఇందులో రవిబాబునే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. తన డైనమిక్ పర్సనాలిటీ అందుకు తగ్గట్టుగా డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ అంతా సినిమాలో సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి. అందుకు తన హార్డ్ వర్క్ ఇందులో కనిపిస్తుంది. మెయిన్ గా కార్ షెడ్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు.
అలానే రవిబాబు పెర్ఫామెన్స్ పరంగా కూడా ఇందులో ఆశ్చర్యపరిచారు అని చెప్పొచ్చు. సెకాండఫ్ లో తన ఫ్యామిలీపై వచ్చే ఓ హార్డ్ హిట్టింగ్ సీక్వెన్స్ లో తన పెర్ఫామెన్స్ చాలా బాగుంది. అలానే కొంతవరకు తన ఇంటెలిజెన్స్ కథనం కూడా ఓకే అనిపిస్తుంది.
ఇక ఇతర నటుల్లో బేబీ తేజల్ విఖ్యాతి చాలా బాగా చేసింది. అద్యంతం సినిమా అంతా కొనసాగుతూ పాప మంచి హావభావాలతో ఆకట్టుకుంది. అలానే నెగిటివ్ రోల్స్ లో కనిపించిన వీరన్న చౌదరి, రోనసన్ విన్సెంట్ తదితరులు బాగా చేసారు. అలానే తనీష్ కూడా తన రోల్ లో పర్వాలేదు అనిపిస్తాడు. వీరితో పాటుగా రవిబాబుతో సాగే యువ నటీనటులు కూడా డీసెంట్ పెర్ఫామెన్స్ లు అందించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో కథనం రేసీగా పెద్దగా బోర్ లేకుండానే వెళ్ళిపోతుంది కానీ ఇందులో ప్లాన్ చేసుకున్న సీన్స్ మాత్రం చాలా వరకు రొటీన్ అనిపిస్తాయి. మొదలైన కొన్ని నిమిషాలకే సినిమా మీద ఒక ఐడియా వచ్చేస్తుంది.
కానీ దానిని రవిబాబు తీసుకెళ్లిన విధానం కొంత సమయం తర్వాత రొటీన్ ఫార్మాట్ లో ఊహాజనితంగా సాగడం ఒకింత డిజప్పాయింట్ చేస్తుంది. ముఖ్యంగా చాలా లాజికల్ ఎర్రర్స్ ఇందులో కనిపిస్తాయి. స్టేట్ లో సెన్సేషన్ అయ్యిన పాప కోసం పోలీసులకి తెలీకపోవడం, కీలక వస్తువును ఒక బొమ్మలో దాచడం ఇలా చాలా సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి.
అలాగే కొంచెం పర్వాలేదు అనిపించే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కొంచెం డల్ గా అనిపిస్తుంది. అలానే యాక్షన్ డోస్ లో సత్తా కూడా నెమ్మదిగా లోపించినట్టు అనిపిస్తుంది. వీటిని మరింత సాలిడ్ గా ప్లాన్ చేయాల్సింది. అలానే సినిమాలో చూపించే వైలెన్స్ సీన్స్ ఓ వర్గం ప్రేక్షకులకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు ఓకే అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. అయితే వి ఎఫ్ ఎక్స్ లాంటివి కొన్ని చోట్ల వీక్ గా ఉన్నాయి. అలానే మ్యూజిక్ పర్వాలేదు. కొన్ని చోట్ల స్కోర్ బాగుంది. కెమెరా వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ కూడా ఓకే.
ఇక దర్శకుడు రవిబాబు విషయానికి వస్తే తన నుంచి ఇది వరకు వచ్చిన కామెడీ, హారర్ లేదా క్రైమ్ థ్రిల్లర్స్ కి భిన్నంగా ఇది సాలిడ్ యాక్షన్ అటెంప్ట్. అయితే ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్, కొన్ని తన మార్క్ సీన్స్ ని బాగా డిజైన్ చేసుకున్నారు కానీ లాజికల్ గా మాత్రం కథనంలో కొన్ని సీన్స్ లో కాంప్రమైజ్ అయ్యారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే బాగానే ఉంది. కానీ సెకండాఫ్ లో మాత్రం కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. అలానే రవిబాబు కొన్ని రొటీన్ డైలాగ్ ఫార్మాట్ ని కూడా మార్చాల్సి ఉంది. ఉదాహరణకు తన గ్యాంగ్ ని అలెర్ట్ చేసి పెట్టిన ఫస్ట్ మీట్ లో కొన్ని డైలాగ్స్ చెప్తారు. అవి చూస్తున్నప్పుడు ఆడియెన్స్ కి రిపీటెడ్ ఫీల్ కలుగుతుంది. దీని వల్ల సీరియస్ సినిమాలో కామెడీ డైలాగ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటివి కూడా కొంచెం తను కరెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఇవి మినహాయిస్తే తనపై ఉండే ఒక అంచనాకు ఇది కొంచెం దగ్గరకి వెళ్ళింది అనుకోవచ్చు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘రేజర్’ రవిబాబు సినిమాలు బాగా ఇష్టపడేవారికి, తన సినిమాల కోసం మినిమం ఐడియా ఉన్నవారికి బిలో యావరేజ్ ఫీల్ మిగులుస్తుంది. తన పెర్ఫామెన్స్, యాక్షన్ ఇందులో హైలైట్ గా నిలవగా లాజికల్ ఎర్రర్స్, కొంచెం డౌన్ అయ్యిన సెకండాఫ్ లు ఇందులో డిజప్పాయింట్ చేస్తాయి. సో మరీ రవిబాబు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్ప మిగతా ఆడియెన్స్ అంచనాలు చాలా తక్కువ పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
