వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు మళ్ళీ తన మార్క్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం హై వోల్టేజ్ వయొలెన్స్ అండ్ యాక్షన్‌తో నింపేశారు. ఈ ట్రైలర్‌లో రవిబాబు మునుపెన్నడూ లేని విధంగా మోస్ట్ వయెలెంట్‌గా, రా అవతారంలో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఒక చిన్న పాపను కాపాడే క్రమంలో రవిబాబు చేసే మారణహోమం మనకు ఈ చిత్ర మెయిన్ ప్లాట్‌గా చూపెట్టబోతున్నారని ఈ ట్రైలర్‌లోనే రివీల్ చేశారు. వయొలెన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే, రవిబాబు ఈసారి చాలా గ్రిప్పింగ్‌గా ఇంటెన్స్ మర్డర్ మిస్టరీని ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.
ఇక టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్. రాజేష్ సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ ‘రేజర్’ చిత్రంతో రవిబాబు మరోసారి తనదైన మార్క్ హిట్ అందుకుంటాడా అనేది వేచి చూడాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
