సెట్స్ లోకి అడుగు పెట్టిన “భీమ్లా నాయక్” సినిమాటోగ్రాఫర్!

Published on Jul 29, 2021 6:20 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం పై టాలీవుడ్ లో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వంశీ నిర్మిస్తున్న ప్రొడక్షన్ 12 చిత్రానికి దర్శకత్వం సాగర్ కే చంద్ర వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ విషయం లో చిత్ర యూనిట్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రముఖ సినిమాటోగ్రఫర్ అయిన రవి కే. చంద్రన్ ను ఈ చిత్రం కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా సెట్స్ లో రవి కే. చంద్రన్ తో పవన్ కళ్యాణ్, దర్శకుడు సాగర్ కే చంద్ర, త్రివిక్రమ్ లు కలిసి ఉన్న ఫోటో ను చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ చిత్రంకు సంగీతం తమన్ అందిస్తున్నారు.అయితే రవి కే. చంద్రన్ రాకతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ గ్లింప్స్ ఇప్పటికే అభిమానులను, ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :