రవితేజ మరో సినిమా మొదలుపెట్టేస్తున్నాడు!
Published on Feb 5, 2017 9:59 am IST


‘బెంగాల్ టైగర్’ విడుదలై సంవత్సరం దాటాక, రవితేజ, తాను చేయబోయే కొత్త సినిమాలను అనౌన్స్ చేయడంతో పాటు సెట్స్‌పైకి కూడా తీసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరంన్నర గ్యాప్‌లో నిరుత్సాహపడ్డ ఆయన అభిమానులకు ఉత్సాహాన్నిచ్చేలా గత వారమే ‘టచ్ చేసి చూడు’ అన్న సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళగా, తాజాగా రేపు ‘రాజా ది గ్రేట్‌’ను కూడా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దిల్‌రాజు నిర్మాణంలో భారీ ఎత్తున తెరకెక్కనున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ రేపు ఉదయం హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలవుతోంది.

‘పటాస్’, ‘సుప్రీమ్’ సినిమాలతో సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న ఈ సినిమాలో రవితేజ ఓ అంధుడిగా కనిపించనున్నారట. ఇక టచ్ చేసి చూడు విషయానికి వస్తే, వెంకీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కూడా రవితేజ స్టైల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గానే ప్రచారం పొందుతోంది.

 
Like us on Facebook