
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించనున్న సినిమాలు వరుసగా సెట్స్ పైకి వెళ్తున్నాయి.రెండు రోజుల క్రితమే రవితేజ నటించనున్న ‘బెంగాల్ టైగర్’ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ మూవీ లాంచ్ లో రవితేజ తన స్లిమ్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరూ పర్ఫెక్ట్ పిజిక్ తో ఉండే హాన్డ్సం హీరో రవితేజకి ఏమైంది అని అనుకున్నారు. కానీ మాకు విశ్వసనీయ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం రవితేజలో ఈ మార్పు అనుకొని చేసిందనే అంటున్నారు.
రవితేజ తన తదుపరి సినిమాలోని పాత్ర కోసం ఇలా వెయిట్ లాస్ అయ్యాడని చెబుతున్నారు.అలాగే రవితేజ లుక్ టెంపరరీ మాత్రమే అని తన తదుపరి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగానే మునుపటి రవితేజని చూడచ్చని సమాచారం. ప్రస్తుతం రవితేజ సురేందర్ దర్శకత్వంలో ‘కిక్ 2’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఇటీవలే జైసల్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం త్వరలోనే హంపి వెళ్లనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే లో రిలీజ్ కానుంది. అలాగే రవితేజ – తమన్నా జంటగా నటించనున్న బెంగాల్ టైగర్ మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది.