కళ్యాణ్ రామ్ “బింబిసార” టీమ్ కి రవితేజ కంగ్రాట్స్!

కళ్యాణ్ రామ్ “బింబిసార” టీమ్ కి రవితేజ కంగ్రాట్స్!

Published on Aug 7, 2022 9:43 PM IST

కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ బింబిసార. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబడుతోంది. ఈ చిత్రం టాలీవుడ్ కి మంచి రోజులని తీసుకు రావడం తో సినీ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పై మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

బింబిసార చిత్రం విజయం సాధించినందుకు కంగ్రాట్స్. డెబ్యూ డైరెక్టర్ అయిన వశిష్ట్ చాలా బాగా తీశారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బ్రిలియంట్, చాలా డెడికేటెడ్ గా చేసాడు. నిర్మాత హరికృష్ణ సినిమా కోసం 100 శాతం కష్టపడినందుకు అభినందనలు. అరెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా సినిమా ఇలాంటి రిజల్ట్ ఉండేది కాదు అంటూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పై ప్రశంసల వర్షం కురిపించారు. మంచి విజువల్స్ చూపించిన చోటా కె నాయుడు ను అభినందించారు. హీరోయిన్స్ కేథరిన్ థెరిస్సా, సంయుక్త మీనన్ లతో పాటుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ కి కంగ్రాట్స్ తెలిపారు. రవితేజ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు