సంక్రాతి బరిలోకి దిగాలనుకుంటున్న రవితేజ !

1st, November 2017 - 08:32:35 AM

దగ్గర దగ్గర రెండేళ్ల తర్వాత ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ ఆ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. సినిమా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు లాభదాయకంగా నిలిచింది. దీంతో రవితేజ తన నెక్స్ట్ సినిమాని రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్నారు.

ప్రస్తుతం నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ డైరెక్షన్లో చేస్తున్న ‘టచ్ చేసి చూడు’ చిత్రం సగం వరకు పూర్తయింది. జనవరి కల్లా చిత్రాన్ని పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలవాలనుకుంటున్నాడట రవితేజ. రాశీఖన్నా, శీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటిస్తునం ఈ చిత్రాన్ని నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.