కొద్దిగా బ్రేక్ కోరుకుంటున్న రవితేజ !

14th, September 2017 - 09:00:31 AM


మాస్ మహారాజ రవితేజ లాంగ్ గ్యాప్ తర్వాత ‘రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు’ వంటి రెండు కొత్త సినిమాలని మొదలుపెట్టారు. ఈ రెండు ఒకేసారి మొదలైనా కూడా ‘రాజా ది గ్రేట్’ ముందుగా అన్ని పనులు పూర్తిచేసుకుని అక్టోబర్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

దీని తర్వాత రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా షూట్ కు వెళ్లే ముందు కొద్దిగా బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఎందుకంటే ఈ చిత్రంలో లుక్, ‘రాజా ది గ్రేట్’ లుక్ కు పూర్తి భిన్నంగా ఉంటుందట. అందుకే ఆ లుక్ లోకి మారడం కోసం ఆయన కాస్త టైమ్ తీసుకోనున్నారట. టీమ్ కూడా ప్రస్తుతం ఇతర పనులు చూసుకుంటూ రవితేజ షూట్లో జాయిన్ అవగానే చిత్రీకరణను వేగవంతం చేస్తారట. ఈ చిత్రాన్ని విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేస్తున్నారు.