మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘పవర్’ చిత్రం షూటింగ్ బాంగ్కాక్ లో జరుగుతుంది. రవితేజ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పై ఒక భారీ చేజ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశం కోసం ఒక ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సన్నివేశం రవితేజ కెరీర్ లోనే గొప్పగా నిలవనుందని సమాచారం.
ఈ నెల చివరి వరకు బాంగ్కాక్ లో ఈ చేజ్ చిత్రీకరణ జరగనుంది. ఈ చిత్రం ఆగష్టు లో విడుదల కావొచ్చు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
