భరత్ అంత్యక్రియలకు ఎందుకు హాజరుకాలేదో చెప్పిన రవితేజ !
Published on Jul 2, 2017 10:15 am IST


గత నెల 24వ తేదీ హైదారాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన నటుడు రవితేజ సోదరుడు భరత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే భరత్ అంత్యక్రియలకు రవితేజతో పాటు ఆయన తల్లిదండ్రులు హాజరుకాకపోవడంతో రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన రవితేజ వాటన్నిటినీ ఖండిస్తూ హాజరుకాకపోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.

ప్రమాదంలో భరత్ ముఖాము బాగా దెబ్బతినడం వలన తాను, తమ తల్లి దండ్రులు చూసే ధైర్యం చేయలేకపోయామని, భరత్ ను అలాంటి స్థితిలో చూసి తట్టుకునే శక్తి ఈ వయసులో తమ తల్లిదండ్రులకు లేదని, అందుకే రాలేదని చెప్పారు. అంత్యక్రియల కార్యక్రమాలన్నిటినీ మరొక తమ్ముడు రఘు దగ్గరుండి చూసుకున్నాడని అంతేగాక దహన సంస్కారాలను వేరొకరిచేత చేయించడం అనేది అబద్దమని, చేసింది తమ బంధువేనని వివరణ ఇచ్చారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook