త్వరలో రవితేజ ‘పవర్’ తాజా షెడ్యూల్..!

Power
రవితేజ, హన్సిక జంటగా నటిస్తున్న సినిమా ‘పవర్’. ఇటివలే బ్యాంకాక్ లో 10 రోజుల పాటు భారి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం హన్సిక షూటింగ్ లకు సెలవు పెట్టి విదేశాలలో చక్కర్లు కొడుతుంది. బిజీ బిజీ సినిమా షెడ్యూల్స్ నడుమ కాస్త విశ్రాంతి తీసుకుంది. హన్సిక తిరిగి ఇండియా రాగానే ‘పవర్’ షూటింగ్ మొదలుకానుందని సమాచారం.

రెజినా సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు బాబీ(కెఎస్ రవీంద్ర) దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version