‘క్రాక్’ ఫార్ములానే “రామారావు ఆన్ డ్యూటీ”కి వాడుతున్నారా?

Published on Sep 25, 2021 1:30 am IST

మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో రవితేజ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించగా, శృతిహాసన్ ఒక బిడ్డ తల్లిగా మరియు రవితేజకు భార్యగా నటించి మెప్పించింది. అయితే తాజా సమాచారం ప్రకారం “క్రాక్” సినిమా ఫార్ములాను ఇప్పుడు రవి తేజ హీరోగా నటిస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ”లో కూడా ఉపయోగించనున్నారట.

అయితే ఈ సినిమాలో కూడా రవితేజ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించబోతున్నాడు. ఇందులో కూడా రవితేజకి ఒక భార్య మరియు కొడుకు ఉంటారని సినిమా మొత్తం మంచి ఎమోషనల్‌గా నడుస్తుందట. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతుండగా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :