హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న రవితేజ కొడుకు?

Published on Apr 27, 2022 1:08 am IST


మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన రవితేజకు మహాధన్‌ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్‌లో మహాధన్‌ కనిపించాడు. అప్పటి నుంచి రవితేజ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయంపై ఇంతకు ముందే స్పందించిన రవితేజ మహాధన్‌ చదువు పూర్తవగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా కాలేజీ నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ని మహాధన్‌తో తీయడానికి రవితేజను సంప్రదించారని, దానికి రవితేజ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజా ది గ్రేట్‌ సినిమాతో రవితేజకు మంచి హిట్‌ ఇచ్చిన యంగ్ టాలెంటెడ్ అనిల్‌ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. అయితే త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :