‘రామారావు’ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. డేట్ మారింది !

Published on May 26, 2022 3:00 pm IST

మాస్ మహారాజా రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్ తో ఈ సినిమా రాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ చిత్రం జూన్‌ 17న విడుదలవుతున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, చిత్రబృందం తాజాగా ఒక పోస్ట్ పెట్టింది.

రామారావు ఆన్‌ డ్యూటీ జూన్‌ 17న రిలీజ్‌ కావడం లేదు అని, త్వరలో మా సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం అంటూ చిత్రయూనిట్‌ తెలియజేసింది. మంచి అవుట్‌పుట్‌ రావాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు అని మేకర్స్ తమ పోస్ట్ లో మెసేజ్ చేశారు.

కాగా ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి నుంచి ఈ ప్రాజెక్టు విషయంలో వస్తున్న ఆసక్తికర హింట్స్, అండ్ అప్డేట్స్ పట్ల రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అన్నట్టు ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుంది.

సంబంధిత సమాచారం :