షూటింగ్ మొదలుపెట్టిన మాస్ మహారాజా !

3rd, April 2017 - 04:01:12 PM


గతేడాది ఒక్క సినిమా కూడా చేయని మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ఆరంభంలోనే రెండు సినిమాలకు సైన్ చేసేశారు. వీటిలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ‘రాజా ది గ్రేట్’ కూడా ఒకటి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 6న ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఈరోజే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకుంది. అలాగే చిత్ర యూనిట్ వచ్చే వారం కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం డార్జిలింగ్ వెళ్లనుంది.

‘సుప్రీం, పటాస్’ వంటి సినిమాలతో ఎంటర్టైనమెంట్ కే పెద్ద పీఠ వేస్తూ మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అంతేగాక ఈ చిత్రంలో రవి తేజ్ చూపులేని వ్యక్తిగా నటిస్తుండటంతో ఆసక్తి ఇంకాస్త పెరిగింది. ఇకపోతే ఈ సినిమాలో మాస్ మహారాజ్ సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ ఫేమ్ మెహ్రీన్ కౌర్ ప్రిజాద హీరోయిన్ గా నటిస్తోంది.