చిరంజీవికి సోదరుడిగా రవితేజ.. మధ్య వయస్కుడిగా కూడా?

Published on Jul 11, 2022 8:00 am IST


బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న సినిమాలో రవితేజ నటించనున్నాడని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా రవితేజ క్యారెక్టర్ పై మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో చిరంజీవికి సోదరుడిగా రవితేజ నటించనున్నారని, అలాగే కుటుంబ సమేతంగా శ్రీలంకలో భార్యాపిల్లలతో ఉంటున్న మధ్య వయస్కుడిగా రవితేజ నటిస్తాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

కాగా ప్రొడక్షన్ హౌస్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇదే నిజమైతే ‘అన్నయ్య’ తర్వాత చిరు, రవితేజలు అన్నదమ్ములుగా నటిస్తున్న రెండో సినిమా ఇదే అవుతుంది. రవితేజ తదుపరి రామారావు ఆన్ డ్యూటీలో నటించనున్నారు, ఇది జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మెగాస్టార్ – రవితేజ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :