‘విన్నర్’ పాటను విడుదల చేయనున్న మాస్ మహారాజ్ !
Published on Feb 14, 2017 8:24 am IST


యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర టీమ్ ఆడియో ఆల్బమ్ లోని ఒక్కో పాటను ఒక్కో స్టార్ చేత రిలీజ్ చేయిస్తూ సినిమాకి కావలసినంత ప్రమోషన్ రాబడుతోంది. మొదటి పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయగా తరువాతి పాటలను ప్రముఖ హీరోయిన్ సమంత, తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ లు రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే క్రమంలో మరో మాస్ మసాలా సాంగ్ ను మాస్ మహారాజ్ రవితేజ విడుదల చేయనున్నారు.

చిత్రంలోని ‘బి సి సెంటర్స్’ అనే పాటను ఈరోజు సాయంత్రం 7 గంటలకు రవితేజ తన చేతుల మీదుగా అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు. ఈ ఏడాది వరుసగా రెండు సినిమాల్ని ప్రారంభించి అందరి దృష్టినీ ఆకర్షించిన రవితేజ పాటను రిలీజ్ చేస్తుండటం సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇకపోతే గోపి చంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గానటించగా చిత్రం మంచి కమర్షియల్ విజయాన్ని సాదిస్తుందని బలమైన్ టాక్ వినబడుతోంది.

 
Like us on Facebook