‘ఇరుముడి’ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న రవితేజ !

Irumudi

హీరో రవితేజ ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు అదే జోష్‌తో మరో సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు. రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి ‘ఇరుముడి’ (Irumudi) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

కాగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను చిత్రనిర్మాతలు పంచుకుంటూ రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి (Irumudi). ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version