మరో టాలెంటెడ్ డైరెక్టర్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ?

మరో టాలెంటెడ్ డైరెక్టర్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ?

Published on Nov 13, 2022 7:19 PM IST


హీరో రవితేజ తో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ భారీ క్రేజ్ ప్రాజెక్ట్‌ను చేయబోతున్నాడని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని రూమర్లు వినిపిస్తున్నాయి. పైగా ప్రశాంత్ వర్మ ఇప్పటికే రవితేజకి కథ చెప్పాడని.. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఐతే, ఈ వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

ఎలాగూ ప్రశాంత్ వర్మ ఎప్పటినుంచో ఓ సీనియర్ హీరో కోసం ట్రై చేస్తున్నాడు. నిజానికి బాలయ్య అన్‌స్టాపబుల్ 2 టీజర్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. టీజర్ లో బాలకృష్ణను చాలా బాగా చూపించాడు. అందుకే, బాలయ్య కూడా ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. కానీ, ఇప్పటికే బాలయ్య వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. అందుకే, ప్రశాంత్ వర్మ అంతలో రవితేజ తో ఓ ప్రాజెక్టు ను సెట్స్ పైకి తీసుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు