అక్టోబర్లో సందడి చేయనున్న రవి తేజ !
Published on Jul 17, 2017 1:24 pm IST


‘బెంగాల్ టైగర్’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి ‘రాజా ది గ్రేట్’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇంకో 30శాతం మాత్రమే చిత్రీకరణ మిగిలి ఉన్న ఈ సినిమాలో రవి తేజ చూపులేని వ్యక్తిగా నటించనున్నాడు.

ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేయాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా మెహ్రీన్ కౌర్ ప్రిజాద హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకుల్ని తప్పక అలరిస్తుందని చిత్ర టీమ్ భావిస్తోంది. ఇకపోతే రవి తేజ విక్రమ్ సిరికొండ డైరెక్షన్లో చేస్తున్న ‘టచ్ చేసి చూడు’ కూడా షూటింగ్ దశలో ఉంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook