మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ !

Published on Nov 8, 2021 10:31 am IST

మాస్ మహారాజా రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్ తో ఈ సినిమా రాబోతుంది. అయితే, తాజాగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ పూర్తయ్యాక, పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం విదేశాలకు వెళ్లనుంది. కాగా ఇంటర్వెల్ బ్యాంగ్ గా వచ్చే ఈ ఫైట్ సీన్స్ వెరీ వైల్డ్ గా ఉంటాయట.

సినిమాలో కథకు మెయిన్ టర్నింగ్ పాయింట్ గా ఈ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు విషయంలో వస్తున్న ఆసక్తికర హింట్స్, అండ్ అప్డేట్స్ పట్ల రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అన్నట్టు ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుంది.

సంబంధిత సమాచారం :